హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 40 కిలోల గసగసాలు, 10 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర పెడ్లర్లను వారు అరెస్ట్ చేశారు. తద్వారా డ్రగ్స్ రవాణాకు LB నగర్ జోన్ SOT, జవహర్‌నగర్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కు వారు గసగసాలు, MDMA డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.