సినీ నిర్మాత, డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మంది సినీ సెలబ్రిటీలకు కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసేవారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీలు టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.
కబాలి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కేపీ చౌదరి.. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరించారు. సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారం ఇచ్చారు.