వికారాబాద్ జిల్లా పరిగిలో కేటీఆర్ పర్యటనపై రాత్రి హైడ్రామా నెలకొంది. నేడు కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండాలో కేటీఆర్ పర్యటించనున్నారు. దాస్యానాయక్ తండాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కేటీఆర్ వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు డీఎస్పీని సంప్రదించారు. అయినా అనుమతి రాకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అంతలోనే డీఎస్పీ అనుమతి ఇవ్వడంతో ర్యాలీ మధ్యలోనే ఆపి వెనుదిరిగారు.