24.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: లయన్ కిరణ్

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం మెర్క్యూరే హోటల్ లో సూచిరిండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. అనాథ ముస్లిం బాలలకు ఇఫ్తార్ విందుతో పాటు బట్టలు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారు రంజాన్ పండుగ ప్రజల జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్