Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఈడీ నిష్పాక్షికతపై అనుమానాలు?

     కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్ కంట్రోల్‌ బోర్డు వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి జీ హుజూర్ అంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. నిష్పాక్షికతకు మారుపేరుగా ఉండాల్సిన అత్యున్నత నేర విచారణ సంస్థలు వివాదాస్పదంగా మారాయి. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ, ఈడీ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. కేంద్రంలో తొలిసారి ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ, నార్కోటిక్ వంటికి రంగంలోకి దిగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల నివాసాల్లో వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో తనిఖీలు, సోదాలు చేపడుతున్నాయి. ఏ చిన్న పాటి ఆధారం దొరికినా జైలుకు పంపడానికి కూడా వెనకాడడం లేదు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ నేతలెవరిపైనా ఈడీ కేసులుండవు. ఒకవేళ ఉన్నా అరకొర కేసులే.

   మనదేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థలైన సీబీఐ, ఈడీల గురించి గతంలో ఎవరికి పెద్దగా తెలిసేది కాదు.పెద్ద పెద్ద ఆర్థిక నేరాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిపై విచారణకు పరిమితమయ్యేవి కేంద్ర దర్యాప్తు సంస్థలు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ, ఈడీ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. కేంద్రంలో తొలిసారి ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాధాన్యం పెరిగింది. ప్రధానంగా బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కేసులకు సంబంధించి అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కంటాక్స్, నార్కోటిక్ కంట్రోల్‌ బోర్డు వంటివి రంగంలోకి దిగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు, సోదాలు సర్వ సాధారణమయ్యాయి. అంతేకాదు ఏ చిన్న పాటి ఆధారం దొరికినా జైలుకు పంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్థిక నేరాలకు, వ్యాపారాల్లో అక్రమాలకు ఎవరు పాల్పడినా విచారించాల్సిందే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆదాయపు పన్ను సోదాలు, తనిఖీలు, ఈడీ దాడులు…ఇవన్నీ అక్రమార్కుల గుట్టు విప్పడానికే అయితే ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. అయితే దర్యాప్తు సంస్థల నిష్పాక్షితపైనే అనుమానాలు వస్తున్నాయి. అకస్మాత్తుగా బీజేపీయేతర రాజకీయ ప్రముఖులకు సంబంధించిన కార్పొరేట్‌ ఆఫీసులపై ఇన్‌కంటాక్స్ రైడ్‌లుంటాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు ఇలా ఉన్నట్టుండి రెచ్చిపోవడం వెనక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దర్యాప్తు సంస్థల పనితీరుపై విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడినా దర్యాప్తు జరపాల్సిందే. ఆరోపణల్లో నిగ్గు తేల్చాల్సిందే. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులెవరిపైనా సీబీఐ,ఈడీ,ఐటీ వంటి సంస్థలు కేసులు నమోదు చేయలేదు. ఎక్కడైనా చేసినా ఒకటి అరానే. జనానికి చూపించుకోవడానికే అన్నట్లుగా ఉంటాయి ఆ కేసులు.కమలం పార్టీ నాయకుల దరిదాపులకు కూడా దర్యాప్తు సంస్థలు వెళ్లడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఇలా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడమే నరేంద్ర మోడీ మార్క్‌ రాజకీయమని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక దశలో సీబీఐను పంజరంలో చిలక అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కామెంట్ ఒక్క సీబీఐకే పరిమితం కాదు. ఈడీ సహా అన్ని దర్యాప్తు సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య వర్తిస్తుంది. ఇవన్నీ కేవలం అపవాదులేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంది. పారదర్శక పనితీరుతోనే దర్యాప్తు సంస్థలు మునుపటి గౌరవాన్ని సాధించుకోగలవు.

బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ !
దేశ రాజకీయాల్లో బీజేపీకి, ఆమ్‌ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి రాజకీయ వైరం ఉంది. 2013లో మొద‌టిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఆప్‌ మంచి ఫ‌లితాల‌ను సాధించింది. బీజేపీ తరువాత రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కేజ్రీవాల్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.అయితే జ‌న్‌లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనందుకు నిర‌స‌న‌గా 49 రోజుల‌కే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేశారు. ఆ తరువాత 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను 67 స్థానాల‌ను ఆప్‌ తన ఖాతాలో వేసుకుంది. బీజేపీని కేవ‌లం మూడు స్థానాల‌కు ప‌రిమితం చేసింది. ఆత‌రువాత 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీముఖ్యమంత్రి అయ్యారు. ఆమ్ ఆద్మీపార్టీ జైత్ర‌యాత్ర ఢిల్లీ నుంచి పొరుగునే ఉన్న పంజాబ్‌లోకి ప్ర‌వేశించింది. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ చతికిలపడ్డాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ చరిత్రలో నిలిచింది. ఆప్‌ నేత భగవంత్‌ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. అర‌వింద్ కేజ్రీవాల్ జాతీయ రాజ‌కీయాల‌కు ఎదిగారు. ఢిల్లీ మోడల్ ఇప్పడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్. ఆమ్ ఆద్మీ పార్టీ అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం. ఢిల్లీ మహా నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఏమేం పథకాలు అమలు చేశామో….భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు వివరించే డాక్యుమెంటే …ఢిల్లీ మోడల్‌. ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్‌ను కేజ్రీవాల్‌ ప్రస్తావిస్తుంటారు. ఢిల్లీ మోడల్‌ను మీ రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ కోరుతుంటారు. కేజ్రీవాల్ దృష్టిలో ఢిల్లీ మోడల్‌ ఒక కాగితం కాదు… అభివృద్ధికి చిరునామా అంటారు కేజ్రీవాల్‌. పదకొండేళ్ల రాజ‌కీయ ప్రస్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేక విజ‌యాల‌ను సాధించింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆధిప‌త్యాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డింది. జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ మోడ‌ల్‌తో ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డి ప్ర‌జ‌లను ఆక‌ట్టుకుంటోంది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ హవా దేశమంతా ఉన్న ప్పటికీ రాజధానీ నగరమైనఢిల్లీలో మాత్రం కనపడలేదు. నరేంద్రుడి ఇమేజ్‌ను తట్టుకుని అరవింద్ కేజ్రీ వాల్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేజ్రీవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేశారం టారు రాజకీయ పండితులు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగరాలంటే కేజ్రీవాల్‌ ఇమేజ్‌ను దెబ్బతీ యక తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ భావించినట్లు పొలిటికల్ సర్కిల్స్ అనుమానపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్‌ ను ఈడీ అరెస్టు చేసినట్లు ఆరోపణ లు వెల్లు వెత్తుతున్నాయి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్