25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

డాట్ మొబైల్ యాప్ సంచార్ సాథీ-ఫేక్ కాల్స్ కు చెక్

నిత్యావసరాలు సత్యావసరాలే. ఏ పాట్లయినా సాపాటు కోసమే, ఏ విద్య అయినా కూటి కూసమే. కూడు, గూడు, బట్ట.. రోటీ, కపడా, మఖన్ … ఏ భాషలో చెప్పినా, ఏ రీతిలో చెప్పినా మనిషికి ప్రధాన అవసరాలు ఈ మూడే. అయితే, వేగవంతంగా మారుతున్న నాగరిక సమాజంలో నెసెస్సరీ, లగ్జరీ అనే పదాల అర్థాలు మారిపోతున్నాయి. పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం మాదిరో…ఒకరిని మించి ఒకరు ఉండాలనే భావనో…. నెసెస్సరీలను సైతం పక్కకు తోసేసి ఆ స్థానంలో లగ్జరీలను చేర్చేస్తున్నారు. లగ్జరీ వస్తువులే అత్యవసరాలుగా మారిపోతున్నాయి. పూట గడవడం గగనం గా మారినా…లగ్జరీలకు పెద్ద పీట వేస్తున్నారు. అసలు ఏది అవసరమో, ఏది లగ్జరీయో ఎవరికీ తెలియడం లేదు.

నెసెస్సరీ అయిటమ్ అంటే సాధారణంగా ప్రయోజనకారిగానే ఉంటుంది తప్ప హానికరం అనే మాట వినిపించదు. అయితే, నెసెస్సరీ అయిటమ్ అయినా లగ్జరీ ఐటం అయినా అన్ని ఉపయోగంతో పాటు హనికరంగాను ఉంటున్నాయి. ధనవంతులు, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల గృహాల్లో లగ్జరీ ఐటంగా ఉండే ఫోన్ సెల్ ఫోన్ గా, స్మార్ట్ ఫోన్ గా మోస్ట్ నెసెస్సరీ ఐటంగా మారిపోయింది. ఇదివరలో కాల్స్, ట్రంకాల్స్ బుకింగ్, పీపీ కాల్స్ మాత్రమే నెసెస్సరీ కాల్స్ గా ఉండేవి. ల్యాండ్ ఫోన్ సైతం కొద్దిమంది ఇళ్లలోనే ఉండేది. అయితే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో లేని వ్యక్తి ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎక్కడైనా ఏ వ్యక్తికైనా స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఆ వ్యక్తి ఎంత స్మార్ట్ గా ఉన్నా ఏ హార్ట్ పేషెంట్ గానో లెక్కకట్టేస్తున్నారు.

స్మార్ట్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనే మాట నూటికి నూరు శాతం నిజమే. అయితే, సైబర్ నేరగాళ్ల మహా మోసాల వల్ల ఎందరో వినియోగదారులు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. సైబర్ మోసగాళ్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను క్షణాల్లో నిలువు దోపిడి చేసేస్తున్నారు. ఈ పరోక్ష నిలువు దోపిడీలో.. బ్యాంకు ఖాతాలు గుల్ల చేసేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి లక్షలు, కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇంకా ఎన్నో రీతుల్లో అమాయక ప్రజలను అగచాట్లకు గురిచేస్తున్నారు.

చింకి చొక్కా తొడుకున్నా మంచి పుస్తకం కొనుక్కో అనే మాటకు కాలం చెల్లిపోగా, చేతిలో పైసా లేకపోయినా.. ఏ క్రెడిట్ కార్డుతోనో స్మార్ట్ ఫోను కొనేసుకో అనే మాటలు వచ్చేశాయి. దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్ వినియోగదారులున్నారంటే… స్మార్ట్ ఫోన్ ప్రజలకు హార్ట్ కిందేగా లెక్క కదా..! స్మార్ట్ ఫోన్ వినియోగదారులారా.. కేర్ ఫుల్, బీ కేర్ ఫుల్… సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అప్రమత్తతే అవసరం…అంటూ పోలీసు పెద్దలు గొంతు చించుకుని చెబుతున్నారు. అయినా, సైబర్ మోసాలు సాగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్ల ఆటలు కట్టించడానికి పోలీసులు పలు తరహాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ నేరాలకు చెక్ పెట్టడానికి టెలికాం విభాగం డాట్ చర్యలకు ఉపక్రమించింది. సంచార్ సాథీ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది.

దాదాపు వంద కోట్లున్న స్మార్ట్ వినియోగదారుల్లో అధికశాతం మంది మోసపూరిత కాల్స్ బారిన పడుతున్నారు. సైబర్ ముఠాలు బ్యాంకు మేనేజర్ అని, పోలీస్ అధికారినని, స్మగ్లింగ్ పార్సిల్ వచ్చిందనో..మాయమాటలు చెప్పి స్మార్ట్ వినియోగదారులను మోసగిస్తున్నారు. ఇక ఎస్ఎంఎస్ ల మోసాలకైతే అంతే లేదు. ఈ సైబర్ మోసాలకు చెక్ పెట్టడానికి ఎన్నో రీతుల్లో ఆలోచించిన టెలికాం..చివరకు సంచార్ సాథీ పేరుతో మొబైల్ అప్లికేషన్ ను తీసుకొచ్చింది. అనుమానిత కాల్స్, ఫేక్ ఎస్ఎంఎస్ ల గురించి మరింత సులభతరంగా రిపోర్ట్ చేయడానికి వీలుగా దీన్ని తీసుకొచ్చింది.

మోసపూరిత కాల్స్ చెక్ పెట్టడానికి 2023 లో సంచార్ సాథీ పొర్టల్ ను టెలికం ప్రారంభించింది. తాజాగా.. సంచార్ సాథీ పేరుతోనే మొబైల్ అప్లికేషన్ ను డాట్ తీసుకొచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా అనుమానిత కాల్స్, ఫేక్ ఎస్ఎంఎస్ లకు మరింత చెక్ పడే అవకాశం ఉంది. దీనివల్ల ఎన్నో సదుపాయాలు సైతం ఉన్నాయి. అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్ లను తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి నేరుగా రిపోర్ట చేయడానికి ఇందులో అవకాశం ఉంటుంది. కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రయాణాల్లో పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల కు బ్లాకింగ్ సదుపాయం సైతం కల్పించారు. ఇదేకాక మొబైల్ ఫోన్ల ప్రామాణికతను సైతం తెలుసుకునే ఫీచర్ ఉంది.

Latest Articles

డ్యాన్స్ ను జయించిన క్యాన్సిల్…డామిట్ కథ అడ్డం తిరిగింది

నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి...కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్