ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫుడ్ నుంచి ఏది కావాలన్నా అన్నీ ఫోన్‌లోని యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటున్నాం. అలాగే ఒక మొబైల్ యాప్ ద్వారా రౌడీలను బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా రాబోతోంది. అదే ‘డాన్ 360’. ఫుల్ యాక్షన్డ్ ప్యాక్ మూవీగా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో, దర్శకుడు భరత్ కృష్ణ, హీరోయిన్ ప్రియా హెగ్డే, నటులు సతీష్ సారిపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో భరత్ కృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక కొత్త కాన్సెప్ట్‌తో నేను రాసుకున్న కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆశీర్వదిస్తారు.. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కథ చెప్పగానే నచ్చి మా ఈ సినిమాని ప్రోత్సహించి.. ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అర్చన అనంత్ గారు, సారిపల్లి సతీష్ గారికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.
హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
సతీష్ సారిపల్లి మాట్లాడుతూ ‘‘భరత్ కృష్ణ చెప్పిన కథ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న కొత్త డైరెక్టర్ అన్నట్టు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి లాగా సినిమా తీశాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
నటీనటులు : భరత్ కృష్ణ, ప్రియా హెగ్డే, శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్ మరియు సతీష్ సారిపల్లి
ప్రొడక్షన్ : జె ఎస్ ఎంటర్టైన్మెంట్స్
డి ఓ పి : శ్రవణ్
మ్యూజిక్ : రాజ్ కిరణ్
యాక్షన్ : శాలిని మల్లేష్
సింగర్ : జావేద్ అలీ
ఎడిటర్ : బాలరాజు బుక్య
రచయిత మరియు దర్శకత్వం : భరత కృష్ణ