స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ జరిగే మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు కీలకం. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భారత జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం (ఆగస్టు 8) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. అందువల్ల స్టార్టర్ల పొజిషన్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. అందువల్ల స్టార్టర్ల పొజిషన్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
IND vs WI: డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ విండీస్‌తో తలపడనున్న టీం ఇండియా
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ 27, 6 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 3, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తద్వారా మూడో టీ20 మ్యాచ్‌లో యువ లెఫ్టార్మ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేసే అవకాశముంది. ఇందులో భాగంగానే జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రావొచ్చు. అప్పుడు ఇషాన్ కిషన్ 3వ స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇషాన్ లేదా గిల్ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటే ఒక బౌలర్ తప్పుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ముఖేష్ కుమార్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్ ల్లో ముఖేష్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పటికీ 2వ టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. తద్వారా 3వ టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 5వ బౌలర్‌గా కనిపించవచ్చు.
Latest Articles
- Advertisement -