21.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

Heavy Rains: బయటకు రావొద్దు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
హనుమకొండ, జనగామ, వరంగల్‌లో కొన్ని చోట్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. నిజామాబాద్‌ జిల్లా వెల్పూర్‌లో అత్యధికంగా 40 సెం.మీ, జక్రాన్‌పల్లి, భీంగల్‌ 23 సెం.మీ, వరంగల్‌ జిల్లా సంగెం 22సెం.మీ, నెల్లబల్లిలో 17సెం.మీ, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ 17సెం.మీ, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ 16సెం.మీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ 14సెం.మీ, సాయంపేట, పరకాల, మోర్తాడ్‌, ఆర్మూర్‌లో 14సెం.మీ, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, ములుగులో 13సెం.మీ, బోనకల్‌, పాలకుర్తి, డోర్నకల్‌లో 12సెం.మీ, చెన్నారావుపేట, శ్రీరాంపూర్‌, కూసుమంచి, మహబూబాబాద్‌లో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.
 భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపులు బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కరెంట్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దని కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్