DLF | సాధారణంగా ఎవరైనా ఇల్లు లేదా స్థలం ఉచితంగా ఇస్తామంటే జనాలు ఎగబడడం మామూలు విషయమే. కానీ ఏడు కోట్ల రూపాయలకు ఇంటిని అమ్ముతామంటే జనాలు తండోపతండాలుగా రావడం ఎక్కడైనా చూశారా. ఎంతలా అంటే కేవలం ఆ రద్దీని కంట్రోల్ చేయలేక వారిని సముదాయించే స్థితికి వచ్చేంత. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ DLF ఆర్బర్ పేరుతో గురగ్రామ్(Gurugram) లో కొత్తగా లగ్జరీ ప్రాజెక్ట్ చేపట్టింది. ఒక్కో ఇంటిని రూ.7కోట్లకు అమ్ముతామని ప్రకటించింది. అంతే కంపెనీ కార్యాలయానికి జనం ఎగబడ్డారు. కేవలం మూడు రోజుల్లోనే 1,137 ఇళ్లు అమ్ముడుపోయాయి. కంపెనీ కార్యాలయం దగ్గర జనం కిక్కిరిసి ఉన్న ఫోటోను వీకెండ్ ఇన్వెస్టింగ్ అధినేత అలోక్ జైన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కంపెనీ పబ్లిసిటీ స్టంట్ అని.. అన్ని ఇళ్లు వారే కొనుక్కొని ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.