ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.33 లక్షల మంది పెన్షనర్లకు రూ.1747.38 కోట్లని జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11.00 గంటల వరకు 56.08 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తిఅయింది. ఇప్పటివరకు 35.51 లక్షల మందికి రూ.979.57 కోట్లు అందజేశారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టనున్నారు. హాస్పిటల్స్ లో ‘నాడు – నేడు’ పనుల పురోగతి, ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు, ఆరోగ్య శ్రీ తదితర అంశాలపై చర్చించనున్నారు.


