ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్ల పంపిణీపై దుమారం రేగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ పెన్షన్ల పంపిణీని ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నాయి. చంద్రబాబు.. నిమ్మగడ్డ చేత లేఖ రాయించడం వల్లే పెన్షన్ దార్లు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. గత నెలలో 35 మంది, ఇప్పుడు ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారని.. ఇందుకు జగన్, CS కారణమని ఆయన ఆరోపించారు.


