25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

పొలిటీషియన్ లుక్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనుకోని విధంగా అనీల్ రావిపూడి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన సీక్రెట్‌గా సినిమా ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించిన టీజర్ అదేనా..లేక అనీల్ రావిపూడి యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారా అనేలా ఆ వీడియో ఉంది. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు?

వీడియో చాలా గ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కెమెరాను చూస్తూ అనీల్ రావిపూడి చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. మేకింగ్‌కి సంబంధించిన సలహానిస్తున్నారు. ఈ వీడియోలో ఆయనొక రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించారు. బాక్సాఫీస్ సక్సెస్ చూసిన తనకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలనుందని ఆ వీడియోలో చెప్పారు. పార్టీ పెట్టబోతున్నామని.. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తానని వెల్లడించారు.

ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ వీడియోలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే ప్రేక్షకులు ఈ వీడియో వెనుకున్న రహస్యాన్ని కనుగొనాలనే ఆసక్తితో ఉన్నారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాతో అనీల్ రావిపూడి పొలిటికల్ మూవీని చేస్తున్నారా లేక ఆహా నిర్మాణంలో అనీల్ రావిపూడి నటించబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది.

https://www.instagram.com/p/CztQpWCRfBK/

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్