స్వతంత్ర వెబ్ డెస్క్: డిజిటల్ పేమెంట్స్ పెరిగినప్పటి నుంచి నగదు రహీత లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయి. చిన్న షాపులు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నిటిలో డిజిటల్ పేమెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ సంస్థలు సైతం డిజిటల్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వాటిలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ చేరిపోయింది. ఇప్పటికే దూర ప్రాంతాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్టీసీ తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో నడిచే సిటీ బుస్సుల్లోనూ క్యాష్‌లెస్ సేవలను తీసుకురానున్నారు. నగరంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో క్యాష్‌లెస్ లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సిటీ బస్సుల్లో క్యాష్ లెస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. నిజానికి గతేడాదే సిటీ బస్సుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు సిటీ బస్సులో డబ్బులతో పాటు ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసి వెసులుబాటును అమలు చేయాలనీ అధికారులు భావిస్తున్నారు. మరి ఈ విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.