నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. పాఠశాలల్లో యూనిఫామ్, బుక్స్ పేరిట యాజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతు న్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ము తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు శివ డిమాండ్ చేశారు.


