మేడ్చల్‌లోని సీఎంఆర్ పాఠశాలలో SFI ధర్నా నిర్వహించింది. పాఠశాలలో యూనిఫాంలు, పుస్తకాలు అమ్ముతున్నారని బైఠాయించి SFI నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాంలు, పుస్తకాలు అమ్ముతున్నా రని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మండిపడ్డారు. డీఈఓ, ఎంఈఓలు CMR పాఠశాలపై చర్యలు తీసుకోవాలని SFI నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్మే గదులను MEO కార్యాలయ సిబ్బంది సీజ్ చేశారు.