శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) రెచ్చిపోయారు. వైఎస్సార్ ఆసరా 3వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధర్మాన ఒక్కసారిగా మీసం మెలేసి, తొడగొట్టారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలంటే లంచాలు తీసుకునేవారని.. తమ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలలో అవినీతి జరిగిందని చంద్రబాబు తొడగొట్టి నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. దీంతో ధర్మాన ప్రసంగం రాష్ట్రమంతా వైరల్ అవుతోంది.
Read Also: వై.ఎస్. షర్మిల అభ్యర్థనను ప్రో. కోదండరాం సమ్మతించారా?
Follow us on: Youtube, Instagram, Google News