22.7 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

హైదరాబద్‌లో తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హైదరాబాద్‌లో తొలిసారి లైవ్ షో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆయనే స్వయంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆయన మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచే ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో విజయాలు సాధించారు. అలాంటిది మొదటి సారి హైదరాబాద్‌లో డీఎస్‌పీ లైవ్ షో ఉంటుందంటే ఎలా ఉంటుందో అని సంగీతప్రియులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.

US, UK, యూరప్, ఆస్ట్రేలియా, UAE లతో పాటు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన దేవిశ్రీ.. ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చారు. సొంతగడ్డపై సంగీత ప్రియులను మైకంలో పడేయ్యడానికి సిద్ధం అయ్యారు. డీఎస్‌పీ మ్యూజిక్, ఎనర్జీ గురించి అందరికీ తెలుసు. అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ఎన్నో ప్రొగ్రామ్స్ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఆయన మ్యూజిక్‌కు ప్రపంచమే ఊగిపోయింది. అలాంటి డీఎస్‌పీ ఇప్పుడు మన దేశంలో ప్రదర్శనలు ఇవ్వడానికి పూనుకున్నారు. అందులో భాగంగా సొంత గడ్డ హైదరాబాద్‌లో ఆయన మొదటి ప్రదర్శనతో ఈ #DSPLiveIndiaTour ప్రారంభించనున్నారు.

#DSPLiveIndiaTour ప్రొగ్రామ్‌ను, ACTC అనే ఈవెంట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఇది కేవలం సంగీత కచేరీ మాత్రమే కాదు, డ్యాన్సులతో అలరించే ఓ అద్భుతమైన సందడి కలిగించే ఈవెంట్. ప్రతీ ఒక్కరూ కాలు కదిపేలా, కన్నుల పండుగగా ఈవెంట్‌గా జరగబోతుందని నిర్వాకులు పేర్కొన్నారు. డీఎస్‌పీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఎన్నో హై-ఎనర్జీ ట్యూన్‌లతో ఈ షో ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 19న జరగబోయే కాన్సెర్ట్ కోసం ACTC ఈవెంట్‌ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. కాన్సెర్ట్ కోసం టిక్కెట్లు పొందాలంటే www.actcevents.com అనే వైబ్ సైట్ ద్వారా, అలాగే Paytm ఇన్‌సైడర్‌లో టిక్కెట్‌లు కొనుగోలు చేయవచ్చు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్