29.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

లోక్ సభ ఎన్నికల వేళ కీలకంగా మారిన అభివృద్ది, రిజర్వేషన్లు

    అభివృద్ధి, రిజర్వేషన్లు తెలంగాణ లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. గత పదేళ్ల కాలంలో అటు కేంద్రం, ఇటు బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆగమాగం అయిందని కాంగ్రెస్ పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. కాగా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

గత పదేళ్లకాలంలో భారతీయ జనతా పార్టీ పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని విధాల నష్టపోయిందని కాంగ్రెస్ పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. నయవంచన – పదేళ్ల మోసం – వందేళ్ల విధ్వంసం ..అనే పేరుతో ఇటీవల కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిం దని చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లోనే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల పరిధిలోని 211 గ్రామాలను బలవంతంగా ఆంధ్రప్రాంతంలో విలీనం చేసిందని నరేంద్ర మోడీ సర్కార్‌పై మండిపడింది హస్తం పార్టీ. గ్రామాల విలీనంతో తెలంగాణ దెబ్బతిందని కాంగ్రెస్ పార్టీ నిప్పులు కక్కింది. ఈ సందర్భంగా విభజన హామీలను ప్రత్యేకంగా ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హమీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని బీజేపీపై హస్తం పార్టీ నిప్పులు చెరిగింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ సంగతిని కేంద్ర ప్రభుత్వం మరచిపోయిందని చార్జ్‌షీట్ దుయ్యబట్టింది. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని గాలికొదిలేసిందని మండిపడింది.

గత పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి కారణం బీజేపీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన, వివక్షా పూరిత విధానాలేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది. పన్నుల రాబడిలో తెలంగాణ వాటాను 27 శాతానికి తగ్గించిందని చార్జ్‌షీట్ ఆరోపించింది. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూపాయి పంపితే కేవలం 43 పైసలు మాత్రమే తిరిగి ఇస్తుందని ఆరోపించింది హస్తం పార్టీ. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌కు భారీ ఎత్తున నగదును తిరిగి చెల్లిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉంటే అభివృద్ది అంశంపై తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్‌షీట్‌పై తీవ్రంగా ప్రతిస్పందించింది భారతీయ జనతా పార్టీ. పదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని అలాగే అంతకు ముందు పదేళ్ల పాటు యూపీఏ కూటమి హయాంలో జరిగిన అభివృద్దిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీజేపీ పేర్కొంది.

   అభివృద్ది అంశంపై చర్చకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్ లేదా అమరవీరుల స్థూపం లేదా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరకు రావాలని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అనేకసార్లు వెల్లడించారన్నారు. అయినప్పటికీ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదన్నారు. పైపెచ్చు నరేంద్ర మోడీ హయాంలో అభివృద్ది జరగలేదని హస్తం పార్టీ దుష్ప్ర చారం చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో హల్‌చల్ చేస్తున్న మరో అంశం ..రిజర్వేషన్లు. బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణ లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలు బీజేపీ చేస్తున్న కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు రేవంత్‌. ఇదిలాఉంటే,రిజర్వేషన్లు తొలగిస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అభివృద్ది పథంలో పయనించాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి అని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రిజర్వేషన్లపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని బీజేపీ మండిపడింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడితే ఎస్సీ , ఎస్టీ, ఓబీసీల రిజర్వే షన్లు రద్దు చేస్తామని ఆయన అన్నట్లు దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కమలం పార్టీ నేతలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్