ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. నీటిపారు దల శాఖ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇవాళ హైదరాబాద్ నుంచి విజయ వాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలిం చారు. పవన్ వెంట ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు అధికారులు.పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యత లు స్వీకరించనున్నారు. ఈ క్రమం లో ఆయన ఏపీ సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్‌కు వస్తున్నారు. ఇప్పటికే తన కోసం సిద్ధం చేసిన చాంబర్‌ను పరిశీలించ నున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్బంగా పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు.సెక్రటేరియట్‌లోని 2వ బ్లాక్‌లో జనసేన మంత్రులకు చాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల చాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు ఉంటాయి. రేపు తన చాంబర్‌లో మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.