ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్త్‌లు దక్కబోతున్నాయనే చర్చ జరుగు తోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది.
అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగు తోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతు న్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జనసైనికులు జోరుగా చర్చించుకుంటు న్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగు తోంది.


