దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీకి దక్కుతుందా.. ఎగ్జిట్ అంచనాలు నిజమవుతాయా.. లేదా మళ్లీ నాలుగోసారి కూడా ఆప్ దే అధికారమా.. అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ- ఆప్ హోరాహోరాగా పోటీ పడుతున్నాయి. ఆప్ అగ్రనేతలు ముగ్గురు వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆతిశీ ముగ్గురు నేతలు వెనుకంజలో ఉన్నారు. న్యూ ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ , జంగ్ పురాలో మనీశ్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. కాల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ ముందంజలో ఉన్నారు. బాదిలిలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నారు. శకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు మొత్తం 70 ఉండగా .. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాల ప్రకారం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది.
ఢిల్లీలో మస్లిం ఓటింగ్ పరిశీలిస్తే.. 2015లో దాదాపు ఆప్ కి 77 శాతం మంది ముస్లింలు ఓటు వేశారు. 2020లో ఇది 83 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ కి 13 శాతం, బీజేపీకి 3 శాతం మాత్రమే ముస్లింలు ఓటు వేశారు. 2020లో ఆప్ కి 54 శాతం ఓట్లలో దాదాపు 11 శాతం ముస్లింలు ఓటు వేశారు.