ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అగ్రనేతలకు షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మరో టాప్ లీడర్ మనీశ్ సిసోడియా పరాజయం పాలయ్యారు. కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం సాధించారు. రెండు రౌండ్లు మినహా.. చివరి వరకు వెనుకంజలోనే ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కేజ్రీవాల్‌కి ఎదురుగాలి వీచింది.
జంగ్‌పురాలో మనీశ్ సిసోడియా ఓటమి పాలయ్యారు. 600కు పైగా ఓట్ల తేడాతో ఓడారు మనీష్ సిసోడియా. మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ విజయం సాధించారు.
ఆప్‌కు ఢిల్లీ సీఎం ఆతిశీ గెలుపు కొంత ఊరటనిచ్చింది. ఎట్టకేలకు కల్కాజీలో గట్టెక్కారు ఆతిశీ. రమేశ్ బిధూరిని ఓడించి విజయం సాధించారు. చివరి వరకు వెనుకంజలో ఉన్న ఆమె చివరి రౌండ్‌లో గెలుపొందారు.
ఢిల్లీ బాద్‌షా బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. 27 ఏళ్ల తర్వాత బంపర్ మెజార్టీతో హస్తినకు హస్తగతం చేసుకుంది బీజేపీ. ఇక సంబరాల్లో మునిగిపోయారు కమలనాథులు.