Deepika Padukone |భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ . తెలుగు స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మ భారీ పారితోషకమే తీసుకుంటుందట. ఈ అమ్మడు తీసుకుంటున్న పారితోషకం గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోందట. ప్రస్తుతం ఈ సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Read Also: హీరోయిన్ ని కమిలిపోయేలా కొట్టిన ప్రియుడు
Follow us on: Youtube Instagram