స్వతంత్ర, వెబ్ డెస్క్: అమరావతి – గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మహిళలు మరణించడం మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శుభ కార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి బిడ్డల భవిష్యత్ కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.