Andhra pradesh | కడప జిల్లా ఏఎన్నార్ నగర్‌లో విషాదం నెలకొంది. కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పరీక్షలో విద్యార్థిని గౌతమి సబ్జెక్ట్ ఫెయిలవడంతో తండ్రి మందలించాడు. దీంతో గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది తట్టుకోలేకపోయిన గౌతమి తల్లి ఆదిలక్ష్మి ఆత్మహత్య మనస్తాపంతో రైలు కింద పడి చనిపోయింది. తల్లి మరణంలో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.