29.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

మామ గెలుపు కోసం కోడళ్ళ ప్రచారం

     ఖమ్మం గుమ్మంలో కలవారి కోడళ్ల ప్రచారం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన ఆ కోడళ్లు మామ కోసం స్టార్‌ క్యాంపెయినర్లుగా మారారు. ప్రజల్లోకి వచ్చి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరి ఎవరా కోడళ్లు..? ఆ ప్రచారం ఎలా సాగుతోంది ..?

    ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు పార్టీ నేతలు. ప్రత్యర్థుల్ని మట్టికరిపించేందుకు పావులు కదుపుతు న్నారు. ఎలాగైనా ఓటర్‌ మహాశయులను తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. అయితే,.. ఇందు లో భాగంగానే ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి కోడళ్లు ప్రచార పర్వంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. బాహ్య ప్రపంచంతో అంతగా సంబంధం లేకపో యినా తన మామ గెలుపు కోసం మేముసైతం అంటూ ప్రజా బాట పట్టారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తూ.. తమ మామను గెలిపించాలని అభ్యర్థిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లుగా మారారు.

    ఖమ్మం కాంగ్రెస్‌ పార్లమెంటరీ అభ్యర్ధిగా రామసహాయం రఘురాంరెడ్డి బరిలో నిలిచారు. చివరి నిమిషంలో అభ్య ర్ధిత్వం ఖరారు కావడంతో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ప్రచారంలో దూకిన రఘరామరెడ్డి తన గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీ వారే కావడంతో ఆయన ప్రచారం స్పీడందుకుంది. ఈ క్రమంలో అనుకోని అతిథులుగా రఘురామిరెడ్డి కోడళ్లు అశ్రిత, స్వప్నిరెడ్డిలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ మామను గెలిపించాలని కోరుతున్నారు. అయితే,.. ఎన్నడూ కాలు బయటపెట్టని వీరిద్దరూ ప్రజాక్షేత్రంలోకి రావడం అటు ఖమ్మంలోనే కాదు.. ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

   రామసహాయం కోడళ్లలో ఒకరైన అశ్రిత టాలివుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ కూతురు. ఈమె రఘు రామరెడ్డి ఇంటికి పెద్ద కోడలు. ఈ కారణంగానే తమ మామ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అడుగు పెట్టారు. ఇక తన వియ్యంకుని విజయం కోసం స్టార్‌ హీరో వెంకటేష్‌ కూడా ఈ నెల 7న ఖమ్మంలో ప్రచారం చేయనున్నారు. ఇక మరొకరు స్వప్నిరెడ్డి. ఈమె రఘురామిరెడ్డి చిన్న కోడలు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు కూడా. అయితే,.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి పొంగులేటి పోటీ చేసినా ప్రచారానికి దూరంగా ఉన్న స్వప్నిరెడ్డి.. ఇప్పుడు మాత్రం తన మామయ్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇలా సినీ, పొలిటికల్‌ స్టార్స్‌ కూతుళ్లు ప్రచార పర్వంలో అడుగుపెట్టడం.. అందులోనూ నిప్పుల కొలిమిలా సూరీడు భగభగ మండిపోతున్నా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి రావడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్