T – Congress | ఇప్పటికే వాయిదాపడ్డ నల్గొండ నిరుద్యోగ నిరసన సభకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సభను ఈ నెల 28న నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే మొదటి షెడ్యూల్ ప్రకారం ఈనెల 21న నిర్వహించాల్సి ఉండగా.. తనకు ఈ సభ గురించి సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభ కాస్తా వాయిదా పడింది. కాంగ్రేస్ నేతల మధ్య పోరు నడుస్తుందని గుర్తించిన అధిష్టానం.. ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్ ని రంగంలోకి దించింది. రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డిలతో నదీమ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించేందుకు నేతల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. పార్టీ కోసం వ్యక్తిగత విభేదాలను పక్కన బెట్టాలని నొక్కి చెప్పారు.