స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 139/8 పరుగులు మాత్రమే చేసింది. హల్ వధేరా(64) పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో మతీశ్ పతిరాణా మూడు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ధోని సేన కేవలం 17.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(44), రుతురాజ్ గైక్వాడ్(30) పరుగులతో అదరగొట్టగా.. సీనియర్ ఆటగాడు రహానే 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సీఎస్కే ఇప్పటివరకు 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించింది.