పాతచట్టాలకు కొత్త రంగులు పులమడం వల్ల నేరాల సంఖ్య తగ్గుతాయా అనే ప్రశ్న ప్రస్తుతం తెర మీదకు వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల కాలంలో దేశంలో జరిగిన అనేకానేక నేరాలకు బ్రిటిష్ కాలం నాటి చట్టాలే కారణమా అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం బ్రిటిష్ కాలం నాటి చట్టాల కారణంగానే మొన్నటి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపు లకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేకపోయారా? అని ఢిల్లీ పెద్దలను సామాన్యు లు ప్రశ్నిస్తున్నారు.
క్రిమినల్ చట్టాల్లో మార్పులు అంటే చిన్న విషయం కాదు. న్యాయవ్యవస్థలో ఎంతో కీలకమైన ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. అంతేకాదు క్రిమినాలజిస్టులతో సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు న్యాయరంగ నిపుణులు. ఇంతటి కీలకమైన అంశంపై ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు. ప్రతిపక్షాలకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇవేమీ లేకుండానే కిందటేడాది ఆగస్లులో ఏకంగా మూడు క్రిమినల్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.చెప్పాపెట్టకుండా మూడు క్రిమినల్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మొత్తం క్రిమినల్ లా వ్యవస్థనే బుల్డోజింగ్ చేసే ఉచ్చు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. కాగా మూడు బిల్లులపై విస్తృత సంప్రదింపు లు జరపాల్సి ఉందని కాంగ్రెస్ కు చెందిన మరో నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. అయితే ఈ సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.ఫలితంగా సదరు బిల్లులు ప్రస్తుతం చట్టాలుగా మారాయి. కిందటేడాది కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరుపై మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ కపిల్ సిబల్. న్యాయవ్యవస్థ రూపు రేఖలు మార్చే మూడు కొత్త బిల్లులను ఎవరికీ చెప్పా పెట్టకుండా ఏకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టారని కపిల్ సిబల్ మండిపడ్డారు. ప్రతిపక్షాల నోరు నొక్కేయా లన్న ప్రధాన అజెండాతోనే నరేంద్ర మోడీ సర్కార్ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకువచ్చిందని విమర్శిం చారు నిప్పులు చెరిగారు ఆయన. కాగా కొత్త చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
కొత్త చట్టాలలో కొన్ని చిక్కుముడులున్నాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చట్టం ప్రకారం పోలీసు కస్టడీ సమయాన్ని 15 రోజుల నుంచి 60 నుంచి 90 రోజుల వరకు పొడిగించారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పోలీసు కస్టడీ సమయాన్ని పెంచడం అంటే పౌర హక్కులను కాలరాచడమేంటు న్నారు న్యాయ కోవిదులు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కుల ను కాలరాస్తున్నాయని భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమలులోఉంది. అయితే అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తున్నారు. మరణశిక్షకు గురైనవారిని సహజంగా ఉరితీస్తారు.అయితే మరణ శిక్షను రద్దు చేయాలన్న డిమాండ్ మనదేశంలో కొంతకాలంగా వినిపిస్తోంది. శిక్ష అనేది మనుషుల్లో పరివ ర్తన తీసుకు వచ్చేదిగా ఉండాలి. ఈమేరకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. కంటికి కన్ను సిద్ధాం తాన్ని అవలంబిస్తే, ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది అన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
ఆధునిక సమాజంలో మరణశిక్షకు తావు ఉండకూడదంటున్నారు సంస్కరణవాదులు. అనేకదేశాల్లో ఇప్పటికే మరణశిక్షను రద్దు చేశారు. మరణశిక్షకు బదులు జీవితఖైదు విధిస్తున్నారు. మానవ విలువ లకు పట్టంకట్టే ఆధునిక సమాజంలో మరణశిక్షను అమలు చేయడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదంటున్నారు సంస్కరణవాదులు. అత్యంత క్రూరమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల ఆవేశాలను చల్లార్చడమే ముఖ్యమన్న ధోరణిలో అప్పుడప్పుడు న్యాయస్థానాలు వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇది సరైన పద్ధతి కాదంటున్నారు సంస్కరణవాదులు. కంటికి కన్ను, పంటికి పన్ను సహజ న్యాయమని సామాన్య ప్రజలు అనుకోవచ్చు. అయితే ఈ భ్రమకు వ్యవస్థలన్నీ కలిసి ఆమోద ముద్ర వేయాలా అన్నదే ప్రశ్న. సమాజాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే న్యాయస్థానాల లక్ష్యం కావాలం టున్నారు. అభ్యుదయవాదులు. అసలు నేరాలు జరగడానికి దారితీస్తున్న పరిస్థితులే మిటి అనేదానిపై మౌలికంగా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలంటున్నారు అభ్యుదయవాదులు. మరణశిక్షల్లాంటి అత్యంత కఠిన శిక్షలు విధించినంతమాత్రాన నేరాలు తగ్గుతాయన్న గ్యారంటీ ఎక్కడా లేదు. గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు కూడా. నేరాలు జరిగే పరిస్థితులను,అవకాశాలను నిరోధించే దిశగా వ్యవస్థాపరంగా ఏర్పాట్లు జరగాలి. దోషుల్లో పరివర్తన దిశగా శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాలకు తావులేని సమాజం ఏర్పడుతుందం టున్నా రు సంస్కరణవాదులు. ఇంతటి కీలక అంశమైన మరణశిక్ష రద్దుకు సంబంధించి కొత్త బిల్లుల్లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడాన్ని సంస్కరణవాదులు తప్పుపడుతున్నారు.
నేరస్తుడికి శిక్ష అమలులో భాగంగా నిందితులతో సామాజిక సేవ చేయించాలనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. ఇదిలాఉంటే, ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంది. ఇదే తరహాలో నేరాలపై దర్యాప్తు జరిపే సంస్థలకు కూడా ఆస్తుల జప్తు అధికారాలను కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కట్టబెడుతోంది. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటితో పాటు అరెస్టు సందర్భంగా నిందితులు చేతులకు బేడీలు వేయడాన్ని కొత్త చట్టాలు పునరుద్ధ రించాయి. దీనిని పాతకాలపు పోకడలకు దేశాన్ని మళ్లీ తీసుకువెళ్లడంగా అభ్యుదయవాదులు భావిస్తు న్నారు. ఏమైనా కొత్త చట్టాల పట్ల సంస్కరణవాదులు, అభ్యుదయ వాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.