విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. పవర్ ప్లాంట్‌ల నిర్మాణాలు, చత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను అప్పుల్లోకి నెట్టేసిందని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి. అసలు విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరింది.. వద్దంటోంది బీఆర్ఎస్ వాళ్లేనంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.


