31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

Robin Uthappa |ధోని ఆహారపు అలవాట్ల సీక్రెట్స్‌ బయటపెట్టిన ఊతప్ప

Robin Uthappa  |భారత క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని గురించి క్రికెట్‌ అభిమానులందరికి దాదాపు తెలిసే ఉంటుంది. బ్యాటింగ్‌లో అతడి స్టైలే వేరు. ఎప్పుడూ కూల్‌గా కన్పించే ధోని జట్టు విజయాల కోసం తనదైన వ్యూహలను రూపొందిస్తూ ఉంటాడు. ఆటలోనే కాదు.. తిండిలోనూ ధోని స్టైలే వేరట. ఫిట్‌నెస్‌ కోసం ధోని ఎంత శ్రమిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. నాలుగు పదుల వయసులోనూ శారీరకంగా ధృడంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాడు ధోని. ఈ నెలఖారు నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం ధోని ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెపాక్‌ స్టేడియంలో ధోని ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప ధోని ఆహారపు అలవాట్లకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు ధోని ఫుడ్ ఎలా తినేవాడు.. తినే విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవాడో రాబిన్‌ ఊతప్ప తెలియజేశాడు.

 

తనతో పాటు సురేష్ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీ సింగ్‌, పియూష్‌ చావ్లా, మునాఫ్‌ పటేల్‌, ధోని ఓ గ్రూప్‌ అని.. అప్పుడప్పుడూ అందరం కలిసి హోటల్‌కు వెళ్లి తినేవాళ్లమని ఊతప్ప చెప్పుకొచ్చాడు. దాల్‌ మఖనీ, బటర్‌ చికెన్‌, జీరా ఆలూ, గోబీ, రోటీలు ఆర్డర్‌ చేసే వాళ్లమని, అయితే.. ధోనీ మాత్రం తినే విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాడని చెప్పుకొచ్చాడు. బటర్‌ చికెన్‌ ఆర్డర్‌ చేసి.. చికెన్‌ తినకుండా కేవలం గ్రేవీ మాత్రమే ధోని తినేవాడని, ఒక వేళ చికెన్‌ తినాలనుకుంటే.. రోటీలను పక్కనపెట్టేవాడని ఊతప్ప(Robin Uthappa) ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

 Read Also: రైల్వేస్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియోలు.. ప్రయాణికుల ఆగ్రహం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్