36.4 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

Gudivada Amarnath |ఏపీలో ఆ మంత్రికి నాన్‌ బెయిల్‌ బుల్‌ వారెంట్‌.. కారణం అదే..

ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌(Gudivada Amarnath)కి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయింది. మంత్రి అమర్ నాథ్ సహా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ కి కూడా విశాఖపట్టణం ఆరో మెట్రో పాలిటిన్ మెజీస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయ స్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 ఏప్రిల్ 11న గుడివాడ అమర్ నాథ్ సహా మరికొంతమంది వైసీపీ నాయకులు విశాఖ రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేసించి, విశాఖ – పలాస రైలు ను నిలిపివేసి రైలు రోకో నిర్వహించారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రైల్ రోకో చేపట్టారు.

ఈ కసు విచారణ నేపథ్యంలో ఫిబ్రవరి 27వ తేదీన వ్యక్తిగతం హాజరుకావాలని న్యాయస్థానం సూచించినప్పటికి.. వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: లోకేష్‌కు అసలు.. సిసలైన పరీక్ష.. ఇక్కడ పాదయాత్ర పూర్తిచేస్తే.. రాష్ట్రమంతా చేసినట్లేనా..

Follow us on:  Youtube

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్