పదేళ్లుగా దేశ ప్రజల కోసం బీజేపీ పని చేస్తోందని… దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యమని అన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని మోదీ చేసిన సంక్షేమమేనని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశమిచ్చారన్నారు. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని పురంధేశ్వరి స్పష్టంచేశారు. మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతున్న నేపథ్యంలో.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.