రేపు ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నాగార్జున యువివర్శిటీ లో గుంటూరు జిల్లా కౌంటింగ్, నరసరావు పేట JNTU యూనివర్సి టీలో పల్నాడు జిల్లాకు సంబంధించి న ఓట్ల లెక్కింపు , బాపట్ల జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఒక్కో కేంద్రంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో రౌండ్ పూర్తికావడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ వద్ద 400 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీకి వెళ్లే దారిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 2వేల 500 మందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


