సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన మొట్ట మొదటి ఐస్ కేఫ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్‌లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో.. అదే సమయంలో లడక్ ప్రాంతంలో మాత్రం చలి మంచు కమ్మేస్తోంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనై జేషన్ ఇటీవలే అద్భుతమైన ఐస్ కాఫీ కేఫ్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఐస్ కాఫీ కేఫ్‌లో సాంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలను అందించను న్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. మంచు గడ్డలతో ఈ కేఫ్‌ను తయారు చేశారు. మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడా నికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.


