గెలుపుకోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నా రు. రిజర్వేషన్ల పై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను అనేకసార్లు అవమానించిందని ఆరోపించారు. సీఎం హోదాలోనూ రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ రిజర్వేషన్ ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేదనే ఓడించారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అంబేద్కర్‌కు గౌరవం పెంచిందన్నారు. దళితులు, ఆదివాసీలకు అధికారం అందించిన ఘనత బీజేపీదే అని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూటీ కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని లక్ష్మణ్ చెప్పారు.


