సీఎం జగన్ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి ఫైర్ అయ్యారు. నమ్మించి మోసం చేయడం జగన్ నైజమని అన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12వేల 500 ఇస్తానన్న జగన్… అధికారంలోకి వచ్చాక 5000 కోత కోశారని మండిపడ్డారు. మద్యం నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని అని చెప్పి, మద్యనిషాను అమలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నమ్మించి మోసగిం చాలని చూస్తున్నారని, మళ్లీ నమ్మి మోసపోవద్దని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


