దేశాన్ని పాలించడానికే తాము పుట్టామని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ భావిస్తోందని అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల అభివృద్ధి కుంటుపడడానికి కాంగ్రెస్ కారణం అని ఆరోపించారు. రిజర్వేషన్లు అంటేనే కాంగ్రెస్ చిరాకు పడుతోందని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ డేజంర్ గేమ్ ఆడుతోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందని తెలిపారు.