ఈ రోజు సాయంత్రం మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నాయి. అటు ఖమ్మం సీటు కోసం భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి తన భార్య కోసం.. పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోరుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్ఠానంతో చర్చించి పేర్లు ఖరారు చేస్తారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గా లకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది.