32.5 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

రామోజీ అస్తమయంపై ప్రముఖుల సంతాపాలు

    రామోజీరావు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన రామోజీరావు మృతి వార్త తెలియగానే సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజ యాలు సాధించారని కొనియాడారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానన్నారు. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకో లేదన్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన వ్యక్తి రామోజీరావని చెప్పారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లి రామోజీరావుకు నివాళులర్పించారు.

    ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని.. అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృ తులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

   రామోజీరావు లేనిలోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు జర్నలి జానికి విశ్వసనీయ త, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని చెప్పారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

   రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రామోజీరావుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంతాపం ప్రకటిం చారు. ఎందరో కళాకారులకు రామోజీరావు జీవితాన్ని ఇచ్చారని కొనియాడారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్