ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ప్రాజెక్టు కార్యాలయం ముందు లారీ ఓనర్స్ కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. సింగరేణి నాసిరకం బొగ్గు లోడింగ్ ఇస్తుండడంతో కంపెనీలు కొనుగోలు చేయకుం డా వెనక్కి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఓసీలో ఉత్పత్తి అయ్యే 40 శాతం బొగ్గుని స్థానిక లారీలకు లోడింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ, అధికారులు ఆ తీర్మానాలను తుంగలో తొక్కుతూ రైలు మార్గం గుండా బొగ్గును తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈఎంఐలు కట్టలేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. ఇక నుంచైనా తీర్మానాల ప్రకారం లారీలకు నాణ్యమైన బొగ్గును లోడింగ్‌కి ఇచ్చి తమకు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.


