జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలుగా ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో అనేకమంది ఫిర్యాదులు తీసుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తో పాటు పలువురు అధికారులకు తమ సమస్యలను ప్రజలు విన్నవించుకు న్నారు. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్య లు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. శేరిలింగంపల్లికి చెందిన గాయత్రి, ఉప్పల్ నుండి వచ్చిన వినోద్ కుమార్ తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సారైనా అధికారులు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉప్పల్‌కి చెందిన మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.


