స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆయిల్ కంపెనీలు. మే 1వ తేదీన కమర్షియల్ గ్యాస్ సీలిండర్ల ధరలు తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.171.50 మేరకు తగ్గింది. ఈ కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో కమర్షిల్ సిలిండర్ ధర రూ.1856.50 కు తగ్గింది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1808.50 గా ఉంది. ఇక కలకత్తాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1960.50, చెన్నై లో రూ.2021.50 గా ఉంది. మార్చిలో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు రూ.350 మేర పెంచారు. ఏప్రిల్ లో రూ. 91.50 చొప్పున తగ్గించారు. ఇప్పుడు మేలో మరోసారి రూ.171.50 మేర ధరలు తగ్గించారు. ఇక గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.