తెలంగాణ మహిళా కమిషన్‌కి బహిరంగంగా క్షమాపణ చెప్పారు వేణు స్వామి. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణుస్వామి జోస్యం చెప్పారు. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని అన్నారు.
వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఉమెన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్.. వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరోసారి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. దీంతో మంగళవారం మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరయ్యారు. నాగచైతన్యపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని మహిళా కమిషన్ హెచ్చరించింది.