స్వతంత్ర, వెబ్ డెస్క్: రాబోయేది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ… ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు.. పేదలు మరింత దిగజారుతున్నారని అన్నారు. అసమానతలు తొలిగేలా చేయడమే మన రాజకీయ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యని తెలియజేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మార్పు టీడీపీతోనే సాధ్యమన్నారు. గతంలో ఎన్టీఆర్ వల్లే మార్పు వచ్చింది. ఇప్పుడు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేది చంద్రబాబేనని అన్నారు. రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ రాజకీయానికే పరిమితం కాదు.. ప్రజలకు సేవ చేయడమే మన రాజకీయం. టీడీపీ ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది. ప్రధానులను టీడీపీ నిర్ణయించింది.దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. క్యాష్ వార్ లో గెలిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. దీనికి రాజమండ్రి వేదిక అయింది అని వ్యాఖ్యానించారు.
“జగన్ దగ్గర బ్లాక్ మనీ విపరీతంగా ఉంది. ఇడుపులపాయలోని బంకర్లల్లో బ్లాక్ మనీ ఉంది. జగన్ దగ్గరున్న బ్లాక్ మనీ పోతే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. ఎన్నికల్లో క్యాష్ ప్రభావం ఉంటే పేదలకు ఇబ్బంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. సరైన సనయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.” – యనమల