స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర, నంబూరు హజ్ క్యాంప్ నుంచి హజ్ యాత్రికుల బృందం బయలు దేరనున్నారు. ఈ క్రమంలో వీరు సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంబూరు చేరుకుంటారు. అక్కడ హజ్ క్యాంప్ లో హజ్ యాత్రికుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగే దువాలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.