తెలంగాణలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు.. గురుకులాలను సందర్శించబోతున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్‌పాయిజన్ కేసులు, ఆహార నాణ్యతపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేయనున్నారు. రాష్ట్ర, జిల్లాల వ్యాప్తంగా మంత్రులు తనిఖీలు చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం, మంత్రులు ముచ్చటించి వారి కోసం వండిన భోజనాన్ని ముందుగా రుచిచూస్తారు. కామన్ డైట్ మెనూను ప్రారంభిస్తారు.