లోక్‌సభ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయన.. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై హస్తం నాయకులకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ఈ సమావే శంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


