సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ ఫూ హై యూన్‌ను కలిశారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు రేవంత్ వెల్లడించారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్ర్లు తయారీ, పర్యావరణం, సుస్థిర శాస్త్రాలు, సాంకేతికతతో సహా అనేక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను వివరించామన్నారు. తెలంగాణ లక్ష్యాలను సాకారం చేయడంలో భాగస్వామ్యం అవుతాయని మంత్రి గ్రేస్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణ, తెలంగాణ సుస్థిర ప్రణాళికలపై ఆమె ఆసక్తిని కనబరిచారాన్నారు. కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు.